సీఎం చంద్రబాబు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి నియామకం
Advertisement
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అడుసుమిల్లి రాజమౌళి నియమితులయ్యారు. రాజమౌళి కొన్నిరోజుల కిందటే కేంద్రం నుంచి డిప్యుటేషన్ పై ఏపీకి వచ్చారు. రాజమౌళి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన ఆయన నేడు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.
ఏపీకి చెందిన రాజమౌళి 2003 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. రాజమౌళి... సీఎం కార్యదర్శిగా పనిచేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కార్యదర్శిగా వ్యవహరించారు. 2015 నుంచి 2019 వరకు ఆయన సీఎంవోలో పనిచేశారు.